V6 News

ప్రతి సర్పంచ్ గ్రామానికి లీడర్‌‌‌‌‌‌‌‌ గా వ్యవహరించాలి : కలెక్టర్ ప్రతిమాసింగ్

ప్రతి సర్పంచ్ గ్రామానికి లీడర్‌‌‌‌‌‌‌‌ గా వ్యవహరించాలి : కలెక్టర్ ప్రతిమాసింగ్

మెదక్​టౌన్, వెలుగు: ప్రతి సర్పంచ్ గ్రామానికి లీడర్‌‌‌‌‌‌‌‌గా వ్యవహరించి సమన్వయంతో అభివృద్ధి చేసుకోవాలని మెదక్​ కలెక్టర్​ప్రతిమాసింగ్​అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌‌‌‌లో 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై సర్పంచులు, కార్యదర్శులకు వర్క్​షాప్​ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ గ్రామాల్లో ఆర్థిక సంఘం నిధులు సక్రమంగా వినియోగించుకొని గ్రామాలను మోడల్‌‌‌‌గా తీర్చిదిద్దాలన్నారు. అంగన్​వాడీ, గ్రామపంచాయతీ భవనాలు లేని చోట్ల కొత్త బిల్డింగ్స్‌‌‌‌ నిర్మించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.